![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-7 ముగింపుకు వచ్చేసింది. హౌస్ లో ప్రస్తుతం అంబటి అర్జున్, ప్రియాంక, యావర్, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, శివాజీ ఉన్నారు. అయితే వీరిలో టైటిల్ విన్నర్ ఎవరో వారికోసం ప్రేక్షకులు గత రెండు వారాలుగా వేసిన ఓటింగ్ ముగిసింది. ఇక ఈ ఓటింగ్ లో బాటమ్-3 లో ఉన్న అర్జున్ ,ప్రియాంక, యావర్ ఎలిమినేషన్ అయినట్లు తెలుస్తుంది.
ఇక టైటిల్ రేస్ లో మిగిలింది ముగ్గురు. అమర్, శివాజీ, పల్లవి ప్రశాంత్. ఈ ముగ్గురి మధ్య ఓటింగ్ లో టఫ్ ఫైట్ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఓటింగ్ పూర్తయ్యే సమయానికి పల్లవి ప్రశాంత్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రెండవ స్థానం కోసం అమర్, శివాజీల మధ్య నవ్వా-నేనే అన్న రేంజ్ లో ఓటింగ్ జరిగిందని పలు సోషల్ మీడియా పోల్స్ లో తెలిసింది. అయితే పల్లవి ప్రశాంత్ అనుకున్నది సాధించాడు రా అంటూ సోషల్ మీడియా లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. " మనం చేసే ప్రయత్నంలో నిజాయితీ ఉంటే ఆ ప్రకృతి సైతం మన వెంటే ఉంటూ మనల్ని ముందుకు నడిపిస్తుంది. కష్టానికి ఫలితం తప్పక లభిస్తుంది " ఇది అక్షరాల నిజమని ఋజువు చేసాడు రైతుబిడ్డ అంటు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ పోస్ట్ లు చేస్తున్నారు.
పొలంలో పండించిన బియ్యం బస్తాతో రైతుబిడ్డగా బిగ్ బాస్ స్టేజ్ మీదకి అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడయ్యాడు పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్ సీజన్-6 ముగిసిన తర్వాత మోస్ట్ పాపులర్ అయిన వ్యక్తిగా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. " అన్న ఒక రైతుబిడ్డగా బిగ్ బాస్ సీజన్-7 కి వెళ్ళాలనుకుంటున్నాను. ఈ పొలం పనులు చేసేటోడికి ఓ అవకాశం ఇవ్వండి" అంటూ సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ చేసిన పోస్ట్ కొన్ని మిలియన్ల వ్యూస్ వచ్చింది. అయితే ఈ పోస్ట్ కి ప్రతీ గ్రామం నుండి అభిమానులు పుట్టుకొచ్చారు. ఇక అక్కడి నుండి పల్లవి ప్రశాంత్ జాతకమే మారిపోయింది. సీజన్-7 మొదలవుతుందని తెలిసినప్పటి నుండి.. పల్లవి ప్రశాంత్ ఇన్ బిగ్ బాస్ సీజన్-7 అంటూ ఒకటే మ్యూజిక్కు.. ఏ యూట్యూబర్ వ్లాగ్ చూసిన, ఏ ఇన్ స్ట్రాగ్రామ్ పోస్ట్ చూసిన , ఏ సోషల్ మీడియా మధ్యమం చూసిన మన రైతుబిడ్డకి సపోర్ట్ చేయండి, మల్లొచ్చిన అంటే తగ్గేదెలే, జై జవాన్ జై కిసాన్ అంటూ పోస్ట్ లు విపరీతంగా కనిపించేవి.
ఇక సీజన్-7 లో అడుగుపెట్టి ప్రతీ టాస్క్ లో ప్రాణం పెట్టి ఆడి.. అసలు తను సొంతంగా ఆడిన ఆటలో ఓటమి అంటూ లేదంటూ నిరూపించాడు పల్లవి ప్రశాంత్. హౌస్ మేట్సే కాదు హోస్ట్ నాగార్జున సైతం పల్లవి ప్రశాంత్ టాస్క్ లో ఆడిన ఆటతీరుకి ఫిధా అయ్యాడు. ఇక ఇప్పటికే సోషల్ మీడియాలో బయటకు వస్తున్న లీకులతో పల్లవి ప్రశాంత్ విన్నర్ అని కన్ఫమ్ అయిన ప్రేక్షకులు సంబరాలు జరుపుకోవానికి సిద్దమవుతున్నారు.
![]() |
![]() |